Renuka Chowdhury | రాహుల్ చెప్పిందంతా నిజం.. ఎందుకు రికార్డుల్లోంచి తొలగించారు..? : రేణుకా చౌదరి
Renuka Chowdhury | లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సోమవారం రాహుల్‌గాంధీ చేసిన హిందూత్వ వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి స్పందించారు.
Renuka Chowdhury : లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సోమవారం రాహుల్‌గాంధీ చేసిన హిందూత్వ వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి స్పందించారు. మంగళవారం పార్లమెంట్ ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ ప్రసంగాన్ని రికార్డుల్లోంచి ఎందుకు తొలగించారని ప్రశ్నించారు.
‘రాహుల్‌గాంధీ ప్రసంగాన్ని వాళ్లు ఎందుకు రికార్డుల్లోంచి తొలగించారు..? అందులో ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు వాళ్లకు ఏం కనిపించాయి..? రాహుల్‌గాంధీ ఏదైతే మాట్లాడిండో అది కరెక్ట్. నేనొక హిందువుగా చెబుతున్నా.. అసలైన హిందువులు హింసను ప్రేరేపించరు’ అని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. వీళ్లకు (బీజేపీ నేతలకు) డ్రమ్స్ వాయిస్తూ అది తప్పు, ఇది తప్పు అని చెప్పడం అలవాటుగా మారిపోయిందని ఎద్దేవా చేశారు.
‘వీళ్లు (బీజేపీ నేతలు) డ్రమ్స్ వాయిస్తారు. ఇది తప్పు అంటారు. అది తప్పు అంటారు. ఆఖరికి మల్లికార్జున్ ఖర్గే ప్రసంగాన్ని కూడా వీళ్లు రికార్డుల నుంచి తొలగించారు. వాళ్లు ఏం చేయాలనుకుంటే అది చేస్తున్నారు. వాళ్ల ఇష్టమొచ్చినట్టు సభను నడుపుతున్నారు. ఇక ముందైనా వాళ్లు ప్రజల గొంతు వినేలా మేం చేస్తాం’ అని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు.
#WATCH | Delhi: On portions of Lok Sabha LoP Rahul Gandhi’s speech expunged, Congress MP Renuka Chowdhury says, “Why did they expunge? What was it that they found so intense? Whatever Rahul Gandhi said is right. I am saying it as a Hindu that a real Hindu is not violent. These… pic.twitter.com/awwUA7paJH
— ANI (@ANI) July 2, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

