బెంగళూరు : ఓలా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ‘ఓలా కృత్రిమ్’లో మెషిన్ లెర్నింగ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న నిఖిల్ సోమ్వాన్షి ఆత్మహత్య ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
అత్యంత దారుణమైన పని సంస్కృతి వల్లే నిఖిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, మరో ఉద్యోగి జాతీయ మీడియాతో చెప్పాడు. కాగా, ఈ అంశంపై ఓలా స్పందిస్తూ, వ్యక్తిగత సెలవుల్లో ఉండగా నిఖిల్ ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నది.