సూరత్ : చంద్రయాన్-3 ప్రాజెక్టులోని ల్యాండర్ మాడ్యూల్ సృష్టికర్తను తానేనని గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన మితుల్ త్రివేది అనే వ్యక్తి చెప్పుకొస్తున్నారు. చంద్రయాన్-2కు కూడా పనిచేశానని, నాసాకు కూడా వర్క్ చేశానని స్థానిక మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూల్లో వెల్లడిస్తున్నారు. ఆయన చెబుతున్నదంతా అబద్ధ మని తేలేసరికి..పోలీసులు కేసు నమోదుచేశారు.