యూపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే సమాజ్వాదీ పార్టీ నేతలపై కేంద్రం ఇలా దాడులు చేయిస్తోందని సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ తీవ్రంగా ఆరోపించారు. ఎన్నికల విషయంలో బీజేపీ కంగారు పడుతోందని, అందుకే ఇలాంటి దాడులు చేయిస్తోందని తీవ్రంగా మండిపడ్డారు.ఇలా దాడులు చేయించడం ద్వారా ప్రతిపక్షాల గొంతు నులిమేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయని కేంద్రం అంటోందని, అదంతా శుద్ధ అబద్ధమని పేర్కొన్నారు. ఇలా నమ్మడానికి తాము నిరక్షరాస్యులమా? చదువుకోని వాళ్లమా? అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే తన కోడలు ఐశ్వర్యను ఈడీ ప్రశ్నించిన విషయంపై మాత్రం జయా బచ్చన్ నేరుగా స్పందించలేదు.