చండీగఢ్: మత విశ్వాసాలను అవమానించే వారిని బహిరంగంగా ఉరితీయాలని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ అన్నారు. పంజాబ్‌లో గత కొన్ని రోజులుగా జరుగున్న సంఘటనలపై ఆయన స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఖురాన్, భగవద్గీత లేదా గురుగ్రంథ సాహిబ్‌లో ఏ మత విశ్వాసాన్ని అయినా దెబ్బతీసే ప్రయత్నం చేసే, అవమానించే దోషులను బహిరంగంగా ఉరితీయాలని, రాజ్యాంగపరమైన అతి పెద్ద శిక్ష విధించాలని సిద్ధూ డిమాండ్ చేశారు.
#WATCH | Punjab Congress chief NS Sidhu says, "Conspiracy going on to disrupt Punjab's peace. Wherever sacrilege takes place, be it of Quran Sharif or Bhagavad Gita or Guru Granth Sahib, they(guilty) should be hanged in public & given biggest Constitutional punishment…" (19.12) pic.twitter.com/z6cGnie3ke
— ANI (@ANI) December 20, 2021