WhatsApp | న్యూఢిల్లీ, జనవరి 1: సైబర్ నేరాలకు వాట్సాప్ ప్రధాన అస్త్రంగా మారుతున్నదని కేంద్రం హోంశాఖ తాజా నివేదిక స్పష్టం చేస్తున్నది. సైబర్ మోసాలపై అందుతున్న ఫిర్యాదుల్లో వాట్సాప్ ద్వారా జరిగిన మోసాలపైనే ఎక్కువగా ఉంటున్నాయని ఈ నివేదిక పేర్కొన్నది. గత ఏడాదికి సంబంధించిన కేంద్ర హోంశాఖ వార్షిక నివేదికలో సైబర్ మోసాలపై కీలక విషయాలు వెల్లడయ్యాయి.
సైబర్ నేరగాళ్లు గూగుల్ యాడ్స్ వంటి గూగుల్ సేవలను ఉపయోగించుకొని ఆన్లైన్ మోసాలకు పాల్పడటం పెరుగుతున్నదని ఈ నివేదిక పేర్కొన్నది. విదేశాల నుంచి కూడా గూగుల్ యాడ్స్ ద్వారా లక్షిత ప్రకటనలు ఇస్తూ మోసాలు చేస్తున్నారు. నిరుద్యోగులు, గృహిణులు, విద్యార్థులే లక్ష్యంగా ‘పెట్టుబడి మోసాలు’ కూడా పెరిగాయి. భారీ లాభాలు వస్తాయనే ఆశ చూపించి బాధితులను సైబర్ నేరగాళ్లు ముంచేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల బృందాలు దేశంలో ఫేస్బుక్ ప్రకటనల ద్వారా అక్రమ రుణ యాప్లను ప్రమోట్ చేయడం కూడా పెరిగింది.