ఎండల కారణంగా ఆటోలో ప్రయాణించే వాళ్లు రక రకాల పద్ధతులను ఫాలో అవుతుంటారు. ఆటో రిక్షాపై గోనె సంచులు వేసుకొని, వాటిని ఎప్పటికప్పుడు తడుపుతూ వుంటారు. లేదంటే తలకి ఓ బట్ట కట్టుకుంటారు. ఇలా రకరకాల పద్ధతులుంటాయి. కానీ.. ఢిల్లీ ఆటో డ్రైవర్ ఓ వినూత్న పద్ధతి అవలంబించాడు. దీంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు.
ఎండల కారణంగా.. ఓ ఆటో డ్రైవర్ ఏకంగా ఆటో టాప్‌పై మొక్కలనే నాటేశాడు. వాటిపై ఎప్పటికప్పుడు నీళ్లను చల్లుతూ వుంటున్నాడు. ఆటోపై ఓ చిన్నపాటి తోట అనుకోండి. ఇలా చేయడంతో ఎండ వేడి నుంచి రక్షణ పొందుతున్నామని, ప్రయాణ సమయంలో చల్లగా వుంటోందని చెబుతున్నాడు. దూరం నుంచి చూస్తే.. అదో చిన్న పాటి గార్డెనే.
ఈ ఆటో డ్రైవర్ పేరు మహీంద్ర కుమార్. గత యేడాది వేసవిలో విపరీతంగా ఇబ్బందులు పడ్డానని, గోనె సంచులతో రక్షణ పొందినా.. ఎండకు ఇబ్బందులు పడినట్లు పేర్కొన్నారు. దీంతో ఈ సారి కాస్త వెరైటీగా ఆలోచించి, ఆటోపై మొక్కలను పెంచుతున్నానని చెప్పాడు.
ఇక… ఈ ఐడియాను చూసి, ప్రయాణికులు కూడా తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపాడు. తన వినూత్న ఐడియాను అందరూ మెచ్చుకుంటున్నారని కూడా పేర్కొన్నాడు. ఇదో సహజమైన ఏసీ అంటూ సంబరపడుతున్నారని అంటున్నాడు.
VIDEO: Autorickshaws are ubiquitous on New Delhi's roads but Mahendra Kumar's vehicle stands out — it has plants growing on its roof aimed at keeping passengers cool during the searing summer season pic.twitter.com/Z6hlqPuf5y
— AFP News Agency (@AFP) May 4, 2022