Supreme Court: క్షమాపణల యాడ్స్ సైజు ఎంత? పతంజలి సంస్థను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
Supreme Court: క్షమాపణలు చెబుతూ 67 పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినట్లు పతంజలి సంస్థ ఇవాళ కోర్టుకు తెలిపింది. అయితే ఆ క్షమాపణల యాడ్స్ ఏ సైజులో ఉన్నాయని జస్టిస్ కోహ్లీ ప్రశ్నించారు. పతంజలి ఉత్పత్తుల కోసం ఇచ్చిన యాడ్స్ సైజులో.. క్షమాపణల యాడ్స్ ఉన్నాయా అని ఆమె అడిగారు.
న్యూఢిల్లీ: పత్రికల్లో పతంజలి సంస్థ ప్రకటించిన క్షమాపణల యాడ్స్ గురించి ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) ప్రశ్నలు వేసింది. కోవిడ్ వ్యాక్సినేషన్, ఆధునిక వైద్యాన్ని కించపరుస్తూ పతంజలి సంస్థ గతంలో ఇచ్చిన యాడ్స్ విషయంలో సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణపై కోర్టు ఇటీవల ఆ కేసులో ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రాందేవ్ సారీ చెప్పారు. పత్రికల్లో క్షమాపణల యాడ్స్ కూడా ప్రచురించినట్లు వెల్లడించారు.
అయితే ఆ కేసులో ఇవాళ జస్టిస్ హిమా కోహ్లీ, ఆషానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. క్షమాపణలు చెబుతూ 67 పత్రికల్లో ప్రకటనలు ఇచ్చినట్లు పతంజలి సంస్థ కోర్టుకు తెలిపింది. అయితే ఆ క్షమాపణల యాడ్స్ ఏ సైజులో ఉన్నాయని జస్టిస్ కోహ్లీ ప్రశ్నించారు. పతంజలి ఉత్పత్తుల కోసం ఇచ్చిన యాడ్స్ సైజులో.. క్షమాపణల యాడ్స్ ఉన్నాయా అని ఆమె అడిగారు. దానికి సీనియర్ అడ్వికేట్ బదులిస్తూ ఉత్పత్తులకు ఇచ్చిన యాడ్స్‌కు లక్షలు ఖర్చు అయ్యాయని తెలిపారు.
క్షమాపణ యాడ్స్ సైజ్‌ను కొలిచేందుకు.. ప్రింట్ అయిన కాపీలను కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. యాడ్స్‌ను కట్ చేసి, వాటిని మాకివ్వాలని, వాటిని పెద్దగా చేసి చూపవద్దు అని, ఆ యాడ్స్‌కు చెందిన అసలు సైజ్‌ను చూడాలనుకుంటున్నామని, ఇది మా ఆదేశమని, క్షమాపణ యాడ్స్‌ను ప్రచురించినప్పుడు, వాటిని భూతద్దం పెట్టి చూడవద్దు అని, పత్రికల్లో యాడ్స్‌ను చదివే రీతిలో ఉండాలని జస్టిస్ కోహ్లీ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

