సిలిగురి: పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి(Suvendu Adhikari) కాన్వాయ్‌పై ఇవాళ దాడి జరిగింది. బీజేపీ నేత సువేందు ఇవాళ కూచ్ బిహార్‌లో పర్యటిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనంపై అటాక్ చేశారు. బుల్లెట్ప్రూఫ్కు వెహికల్‌కు చెందిన అద్దాలను ఆగంతకులు ధ్వంసం చేశారు. అయితే బుల్లెట్‌ప్రూఫ్ కారులో ఉండడం వల్ల ప్రాణాలతో బయటపడినట్లు ఆయన పేర్కొన్నారు. ఇలా జరుగుతుందని తనకు తెలుసు అని బీజేపీ నేత ఆరోపించారు.
కూచ్ బిహార్‌లో జరుగుతున్న నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు అక్కడకు వెళ్లారు. ఆ సమయంలో అటాక్ జరిగినట్లు బావిస్తున్నారు. ఇటీవల బెంగాల్లో మహిళలపై హింస అధికమైంది. నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో టీఎంసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ర్యాలీ తీశారు. తాజాగా బంకురా జిల్లాలో ఆ ర్యాలీ నిర్వహించారు.
#WATCH | Cooch Behar, West Bengal: The convoy of West Bengal LoP Suvendu Adhikari was allegedly attacked in Cooch Behar, while he was on his way to the Superintendent of Police Office. More details awaited. pic.twitter.com/586iocZFHn
— ANI (@ANI) August 5, 2025