కోల్కతా: నైరుతి రుతుపవనాల కారణంగా పశ్చిమబెంగాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా అసన్సోల్ నగరంలో కుంభవృష్టి కురిసింది. దాంతో నగరమంతా వరద గుప్పిట్లో చిక్కుకుంది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ఏరియాల్లోని నివాస ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు చేరింది. దాంతో ఇండ్లు పాక్షికంగా నీట మునిగి జనం ఇండ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. కాగా, పలు ఏరియాల్లో ఇండ్లు నీట మునిగిన దృశ్యాలను ఈ కింది వీడియోలో వీక్షించవచ్చు.
#WATCH | West Bengal: Houses & buildings partially submerged in Asansol following heavy rainfall in the city pic.twitter.com/HfKx63aN5A
— ANI (@ANI) June 18, 2021