CV Ananda Bose : ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో జరిగిన విషాదం మన మనస్సాక్షిని కదిలించిందని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ అన్నారు. ఈ ఘటన బెంగాల్‌కు, దేశానికి, మానవత్వానికి సిగ్గుచేటని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇదే తొలిసారి కాదని, గతంలో వీధుల్లో మహిళలపై అఘాయిత్యాలను ఎన్నో చూశామని చెప్పారు.
నడివీధిలో మహిళలను వివస్త్రలను చేయడం, బహిరంగంగా కొట్టడం, కొరడాలతో కొట్టడం వంటివి రాష్ట్రంలో వెలుగుచూశాయని ఆయన గుర్తుచేశారు. బెంగాల్లో ఈ తరహా ఘటనలు పునరావృతం అవుతున్నాయని అన్నారు. ఈ వేధింపులకు వ్యతిరేకంగా సమిష్టి కార్యాచరణతో ముందుకెళితే వీటిని అడ్డుకోగలుగుతామని చెప్పారు.
శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని, మహిళలు జీవించేందుకు బెంగాల్‌ను మనమంతా సురక్షిత ప్రదేశంగా మార్చాలని గవర్నర్ పిలుపు ఇచ్చారు. మరోవైపు దేశవ్యాప్తంగా కలకలం రేపిన కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబీఐకి అప్పగించడంతో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Read More :
Venkatesh | మాజీ పోలీసాఫీసర్‌గా వెంకటేశ్ బ్యాక్ టు యాక్షన్.. SVC58 క్రేజీ న్యూస్