ఎమ్మెల్యేగా సీఎం మమతా బెనర్జీ ప్రమాణం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా శాసనసభలో గురువారం ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన ఆమెతోపాటు అమీరుల్ ఇస్లాం, జాకీర్ హుస్సేన్ కూడా ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. అసెంబ్లీ స్పీకర్‌కు బదులుగా బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్ వీరితో ప్రమాణం చేయించారు. తద్వారా బెంగాల్లో కొత్త ఒరవడికి ఆయన శ్రీకారం చుట్టారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మమత, టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారి చేతిలో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించడంతో మమతా బెనర్జీ మూడోసారి సీఎం పదవి చేపట్టారు.
కాగా, మమత సీఎంగా కొనసాగాలంటే ఉప ఎన్నికలో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె 58,835 ఓట్ల మెజారిటీతో భారీ విజయాన్ని సాధించారు. మమతకు 85,263 ఓట్లు రాగా, ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్కు 26,428 ఓట్లు పడ్డాయి.
మరోవైపు బెంగాల్లో ఉప ఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లో టీఎంసీ క్లీన్ స్వీప్ చేసింది. జంగీపూర్‌లో టీఎంసీ అభ్యర్థి జాకీర్ హుస్సేన్ 92,480 ఓట్ల మెజారిటీతో, షంషేర్‌గంజ్‌లో అమీరుల్ ఇస్లామ్ 26,379 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

