Obesity | న్యూఢిల్లీ: భారత్‌లో ఊబకాయంతో బాధపడుతున్న వారికి శుభవార్త. డెన్మార్క్ ఫార్మా కంపెనీ నోవో నార్డిస్క్ తీసుకొచ్చిన ‘వెగోవి’ అనే కొత్త ఔషధం మంగళవారం భారత మార్కెట్లో విడుదలైంది. ఊబకాయం, దాంతో వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించటంలో ఈ ఔషధం ఉపయోగపడుతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
భారత్‌లో 0.25 ఎంజీ, 0.5 ఎంజీ, 1 ఎంజీ, 1.7 ఎంజీ, 2.4 ఎంజీ వెర్షన్లలో ఇది లభిస్తున్నది. ఒక్కో ఇంజెక్షన్‌కు రూ.4,336 ధరగా నిర్ణయించారు. వైద్యుడి సూచన మేరకు ఔషధాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.