జైపూర్, జనవరి 22 : ఒక వివాహ ఆహ్వాన పత్రికను తయారు చేసేందుకు రూ.25 లక్షలు ఖర్చయ్యిందంటే ఆశ్చర్యమే కదా. రాజస్థాన్‌కు చెందిన శివ్ జోహారీ తన కుమార్తె వివాహం కోసం మూడు కిలోల స్వచ్ఛమైన వెండితో ఈ ఆహ్వాన పత్రికను తయారు చేయించారు. ఒక్క మేకు, స్క్రూ కూడా వినియోగించకుండా ఈ ఇన్విటేషన్‌ను తయారు చేయించారు.
ఈ వెండి ఆహ్వాన పత్రికలో 65 దేవతా విగ్రహాలను పొందుపరిచారు. పై భాగంలో వినాయకుడి రూపాన్ని, ఇరువైపులా శివపార్వతులు, వాటి కింద లక్ష్మీదేవి, విష్ణుమూర్తుల చిత్రాలను, వేంకటేశ్వరుడు, శ్రీకృష్ణుడి చిత్రాలు, విష్ణువు పది అవతారాలను ఉంచారు.