భోపాల్ : లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఓ వివాహ వేడుకకు హాజరైన అతిథులకు పోలీసులు వింత శిక్ష విధించారు. మధ్యప్రదేశ్ భింద్ జిల్లాలోని ఉమరై గ్రామంలో పెళ్లి జరిగింది. ఈ వేడుకకు సుమారు 300 మందికి పైగా అతిథులు వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసి కొందరు పారిపోయారు. సుమారు ఓ 17 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో నడిరోడ్డుపై కప్ప గంతులు వేయించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారిని పోలీసులు హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
In Bhind "Baaratis" were made to do ‘Frog Jump’ for violating #CovidIndia-19 restrictions. The wedding was being organized, in violation of the lockdown restriction enforced in Bhind @ndtv @ndtvindia @GargiRawat @manishndtv pic.twitter.com/QftxjTsFvL
— Anurag Dwary (@Anurag_Dwary) May 20, 2021