న్యూఢిల్లీ: శిలాజ ఇంధనాలైన పెట్రోల్, డీజిల్ వాడకాన్ని భారీగా తగ్గించి దేశంలో 40 శాతానికి పైగా వాయు కాలుష్యాన్ని తగ్గిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. కాన్ఫిడరేషన్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ సర్వీసెస్ ప్రొఫెషనల్, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ రోపార్, ఢిల్లీ యూనివర్సిటీల ఆధ్వర్యంలో ఢిల్లీలో సోమవారం నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడారు. ఏడాదికి రూ.16 లక్షల కోట్ల విలువైన ముడిచమురు, రూ.12 లక్షల కోట్ల విలువైన బొగ్గును భారత్ దిగుమతి చేసుకుంటున్నదని తెలిపారు. వీటి దిగుమతి వల్ల దేశం ఆర్థికంగా బలహీనపడుతున్నదని పేర్కొన్నారు.