పెగాసస్‌పై నిజం బయటపడింది… సభలో లేవనెత్తుతాం: మల్లికార్జున్ ఖర్గే

న్యూఢిల్లీ: పెగాసస్ స్నూపింగ్ ఆరోపణలు నిజమన్న సంగతి బయటపడిందని రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని ఆయన చెప్పారు. దీనిని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అన్నది విపక్ష పార్టీలతో చర్చిస్తామని చెప్పారు. పలు రంగాలకు చెందిన కొందరి మొబైల్ ఫోన్లపై పెగాసస్ స్పైవేర్‌తో కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టినట్లు గత ఏడాది ది వైర్ సంచలన కథనాలు ప్రచురించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ముందు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ సమావేశాలు సజావుగా సాగలేదు. అయితే ఇజ్రాయెల్, భారత్ మధ్య జరిగిన రక్షణ ఒప్పందంలో పెగాసస్ స్పైవేర్ కేంద్రంగా ఉందని న్యూయార్క్ టైమ్స్ ఇటీవల ఒక నివేదిక ప్రచురించింది. దీంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
కాగా, పెగాసస్ అంశం వల్ల వర్షాకాల సమావేశాలు ప్రభావితమయ్యాయని మల్లిఖార్జున్ ఖర్గే గుర్తు చేశారు. అయితే పార్లమెంట్‌ని నిర్వహించడానికి ప్రతిపక్షాలు అనుమతించడం లేదని పాలక పక్షం చెప్పిందన్నారు. కానీ నిజం మరోసారి బయటకు వచ్చిందని తెలిపారు. దీంతో బడ్జెట్ సమావేశాల్లో ఈ సమస్యను లేవనెత్తుతామని అన్నారు. అలాగే ఇప్పటికే ఉన్న పాత, కొత్త సమస్యలతోపాటు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల సమస్యలు, మహిళలు-దళితులపై నేరాలు వంటి అంశాలను కూడా ఎప్పటికప్పుడు సభలో లేవనెత్తుతామని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

