MP Asaduddin Owaisi: ఔరంగబాద్ నుంచి పోటీ చేస్తాం: ఎంపీ అసదుద్దీన్
MP Asaduddin Owaisi: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ముంబైలో మాట్లాడారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఔరంగబాద్ నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ఇక తెలంగాణలో బీజేపీ నెగ్గదన్నారు.
ముంబై: వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఔరంగబాద్(Aurangabad) నుంచి తమ పార్టీ పోటీ చేయనున్నట్లు ఎంఐఎం చీఫ్(AIMIM Chief) అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) తెలిపారు. ఔరంగాబాద్తో పాటు ఇతర స్థానాల గురించి కూడా పోటీ చేసేందుకు ఆలోచిస్తున్నామని, ఎవరితో పొత్తు కుదుర్చుకోవాలన్న దానిపై కూడా కొన్ని పార్టీలతో సంప్రదింపుల్లో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఎవరితో పొత్తు పెట్టుకుంటామనే దానిపై ఇంత త్వరగా వెల్లడించలేమని ఎంఐఎం చీఫ్ తెలిపారు.
ముస్లింలపై కొందరు ద్వేషభావాన్ని వ్యాప్తి చేస్తున్నారని, కానీ అలాంటి వారిపై ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవడం లేదన్నారు. భారత్ జోడో యాత్రలో రాజస్థాన్ ప్రభుత్వం దేశం అంతా పాల్గొన్నదని, అల్వార్లో జరిగిన రాయల్ వెల్డింగ్లోనూ పాల్గొన్నదని, కానీ జునైద్, నాసిర్లను చంపిన చోటుకు ఆ ప్రభుత్వం వెళ్లలేకపోయినట్లు అసద్ ఆరోపించారు.
తెలంగాణలో 2014, 2018 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని, ఈ ఏడాది డిసెంబర్లోనూ ఆ పార్టీకి ఓటమి తప్పదని అసద్ అన్నారు. ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీని ఓడించనున్నట్లు ఆయన వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

