Mamata Banerjee | నిజం బయటికి రావాల్సిందే.. ఒడిశా రైలు ప్రమాద ఘటనపై మమతా బెనర్జి
Mamata Banerjee | ఒడిశా రైలు ప్రమాద ఘటనకు సంబంధించి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, రైల్వే శాఖ మాజీ మంత్రి మమతా బెనర్జి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
కటక్: ఒడిశా రైలు ప్రమాద ఘటనకు సంబంధించి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, రైల్వే శాఖ మాజీ మంత్రి మమతా బెనర్జి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైలు ప్రమాదానికి సంబంధించి నిజానిజాలు బయటికి రావాలని డిమాండ్ చేశారు. నిజాలను తొక్కిపెట్టడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. నిజాలు బయటికి వచ్చే వరకు తాను డిమాండ్ చేస్తూనే ఉంటానని హెచ్చరించారు.
శ్రీరామచంద్ర భంజా (SCB) మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఒడిశా రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ మనం (రాజకీయ నాయకులం) ప్రజల కోసం పనిచేయాలి. మనం ప్రజలకు అండగా ఉండాలి. తప్పనిసరిగా నిజం బయటికి రావాలని మేం కోరుకుంటున్నాం. నిజాన్ని అణిచిపెట్ట కూడదు’ అని మమతాబెనర్జి వ్యాఖ్యానించారు.
#WATCH | “…We must work for the people. We must be with the people. We want that truth must come out. Truth must not be suppressed,” says West Bengal CM and former Railways Minister Mamata Banerjee after meeting the injured of #BalasoreTrainAccident at SCB Medical College and… pic.twitter.com/MfjlfHMfEh
— ANI (@ANI) June 6, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

