బెంగళూరు, ఆగస్టు 9: పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్‌ను గట్టి దెబ్బే తీశామని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) చీఫ్ ఏపీ సింగ్ వెల్లడించారు. ఆ యుద్ధంలో ఉపరితలం నుంచి గగన తలానికి ప్రయోగించే మన క్షిపణి వ్యవస్థలు ఐదు పాకిస్థాన్ జెట్ విమానాలతో పాటు ఒక గగనతల నిఘా విమానాన్ని కూల్చివేశాయని తెలిపారు. బెంగళూరులో శనివారం జరిగిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఎల్ఎం ఖాత్రే స్మారక సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే 10న పాకిస్థాన్ మిలిటరీ స్థావరాలు లక్ష్యంగా భారత్ జరిపిన దాడిలో జకోబాబాద్ ఎయిర్‌బేస్‌లో పార్క్ చేసి ఉన్న కొన్ని అమెరికా తయారీ ఎఫ్-16 జెట్ విమానాలకు కూడా నష్టం వాటిల్లిందని చెప్పారు.