చెన్నై : జాతీయ భద్రతా సలహారు అజిత్ దోవల్ ఆపరేషన్ సింధూర్పై ప్రశంసలు కురిపించారు. ఐఐటీ మద్రాస్ స్నాతకోత్సవ కార్యక్రమంలో దోవల్ మాట్లాడారు. చాలా కచ్చితత్వంతో 9 ఉగ్ర స్థావరాలను ఇండియా టార్గెట్ చేసిందని, ఆపరేషన్ సింధూర్ సమయంలో ఒక్క టార్గెట్ను కూడా మిస్ కాలేదన్నారు. సరిహద్దు తీవ్రవాదాన్ని అంతం చేయడంలో భారత్ తన సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు చెప్పారు. ఎవరు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని, చాలా కచ్చితత్వంతో ఆపరేషన్ కొనసాగించినట్లు వెల్లడించారు. మే 7వ తేదీన రాత్రి ఒంటి గంట తర్వాత ఆ ఆపరేషన్ మొత్తం 23 నిమిషాలు పాటు సాగిందన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్కు నష్టం జరిగినట్లు ఒక్క ఇమేజ్ లేదా ఫోటోను చూపించగలరా అని ధోవల్ ప్రశ్నించారు.