Supreme Court | వరకట్నం, గృహహింస చట్టాల్లో సంస్కరణలు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సమాజమే మారాలని.. అందులో ఏమీ చేయలేమని చెప్పింది. ప్రస్తుతం ఉన్న వరకట్న, గృహహింస చట్టాలు దుర్వినియోగమవుతున్నాయని.. వాటిని సంస్కరణించాలని పిటిషన్లో కోరారు. చట్టాలను సమీక్షించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల బెంగళూరులో ఓ టెకీ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చట్టబద్ధంగానే తన భార్య వేధింపులకు గురి చేస్తుందంటూ.. చట్టంలోని లొసుగులను బయటపెట్టాడు. టెకీ ఆత్మహత్య తర్వాత వరకట్నం, గృహహింస చట్టాల దుర్వినియోగంపై పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే చట్టంలో సంస్కరణ తీసుకురావాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
న్యాయవాది విశాల్ తివారీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఉన్న చట్టాలను సమీక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. సమాజమే మారాలని.. ఇందులో కోర్టులు ఏం చేయలేమని బెంచ్ స్పష్టం చేసింది. వివాహ నమోదు సమయంలో ఇచ్చిన కానుకలను సైతం నమోదు చేయాలని ఆయన తివారీ డిమాండ్ చేశారు. దాంతో పాటు ఐపీసీ సెక్షన్ 498ఏకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను అమలు చేయాలని కోరారు. చట్టాల్లో సంస్కరణలు తీసుకురావడం ద్వారా అమాయక వ్యక్తుల ప్రాణాలను కాపాడవచ్చని.. చట్టం ఉద్దేశం సైతం నెరవేరుతుందని పిటిషనర్ పేర్కొన్నారు.
Waqf Amendment Bill | వక్ఫ్ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం.. 14 సవరణలకు కమిటీ ఆమోదం