గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 18:09:58

26 నుంచి కాలింపాంగ్‌ జిల్లా కేంద్రంలో లాక్‌డౌన్‌

26 నుంచి కాలింపాంగ్‌ జిల్లా కేంద్రంలో లాక్‌డౌన్‌

కాలింపాంగ్‌ : పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని కాలింపాంగ్‌ జిల్లా కేంద్రంలో కరోనా విజృంభిస్తుండడంతో వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా జులై 26 ఉదయం 9 గంటల నుంచి ఏడురోజులపాటు లాక్‌డౌన్‌ విధిస్తూ జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం కరోనాపై జరిగిన జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలకు అవసరమైన సేవలు అందించే కార్యాలయాలు, ఆరోగ్య సేవలు, శాంతి భద్రతలు, విపత్తు నిర్వహణ, విద్యుత్, నీరు, కన్జర్వెన్సీ సేవలు, అగ్నిమాపక, అత్యవసర సేవలు, కోర్టులు, ట్రెజరీ, బ్యాంకింగ్, రేషన్‌ దుకాణాలు తెరిచే ఉంటాయని వెల్లడించారు. మిగిలిన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు వారంరోజులపాటు మూసివేయనున్నారు. మతపరమైన, సామాజిక కార్యక్రమాలు సైతం నిషేధించారు. నిత్యావసర వస్తువులు విక్రయించే మార్కెట్ సముదాయాలు, దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు.


logo