న్యూఢిల్లీ: వీధిలో నడుస్తున్న మహిళపై వాటర్ ట్యాంక్ పడింది. అయితే అదృష్టవశాత్తు ఆమెకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Water Tank Falls On Woman) ఒక మహిళ వీధిలోని ఎదురింటి వారితో మాట్లాడింది. ఆ తర్వాత ఎదురుగా ఉన్న తన ఇంటి వైపు ఆమె నడిచింది. ఇంతలో ఎదురుగా ఉన్న బిల్డింగ్ పైనుంచి ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్ ఆ మహిళపై పడింది. మనిషి ఎత్తు అంత ఉన్న ఆ వాటర్ ట్యాంకు లోపల ఆమె చిక్కుకున్నది.
కాగా, ఇది చూసి ఇద్దరు వ్యక్తులు పరుగున ఆ మహిళ వద్దకు వచ్చారు. ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్ పడిన ఎదురింటి వారిపై అసహనం వ్యక్తం చేశారు. అయితే అదృష్టవశాత్తు ఆ మహిళకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. అయితే ఈ సంఘటన ఎప్పుడు ఎక్కడ జరిగింది అన్నది తెలియలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు.
An apple a day keeps the doctor away. pic.twitter.com/ugvzXYKDxq
— Hemant Batra (@hemantbatra0) October 13, 2024