వారణాసి, జూలై 2: మోదీ సర్కారు హయాంలో ‘లీకేజీ’లు ఆగడం లేదు. బీజేపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రీమియం వందేభారత్ రైళ్లలోనూ నీళ్లు లీక్ అవుతున్నాయి. ఢిల్లీ-వారణాసి మధ్య మంగళవారం ప్రయాణిస్తున్న ఓ రైలు కోచ్‌లో నీళ్లు లీక్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
నీళ్లు లీక్ అవుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రైల్వే శాఖకు ఫిర్యాదు చేశారు. దీనికి ఉత్తర రైల్వే స్పందిస్తూ.. పైపులు బ్లాక్ కావడం వల్లే నీళ్లు లీక్ అయినట్టు తెలిపింది.