Widows Diwali : దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు మొదలయ్యాయి. ప్రజలంతా రేపటి దీపావళి పండుగకు సంబంధించిన ఏర్పాట్లతో బిజీబిజీగా ఉన్నారు. కొత్త బట్టలు, ఆభరణాల కోసం షాపింగ్, పూజాసామాగ్రి కొనుగోలు లాంటి పనులతో తీరికలేకుండా ఉన్నారు. వివిధ నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో నివాసాలు కొత్తరూపు దిద్దుకున్నాయి. రంగురంగుల లైట్లతో తళుకులీనుతున్నాయి.
యుయనా, గంగా తదతర నదుల తీరాల్లోని ఘాట్లలో ఇప్పటికే భక్తుల సందడి పెరిగిపోయింది. ఆయా నదీ తీరాలకు వచ్చి ప్రజలు దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. మొత్తానికి దేశమంతటా ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. ఈ క్రమంలో వైదవ్యం పొందిన పలువురు మహిళలు యమునా నది తీరంలోని కేశీ ఘాట్లో దీపావళి సంబరాలు చేసుకున్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Vrindavan, Uttar Pradesh: Widows celebrated Diwali at Yamuna Keshi Ghat. (29.10) pic.twitter.com/Xm4Z0zd9hh
— ANI (@ANI) October 30, 2024