డార్జిలింగ్: జీవులు ఏవైనా సరే పసి ప్రాయంలో ముద్దుముద్దుగా బొద్దుబొద్దుగా కనిపిస్తాయి. పసిబిడ్డ, కుక్కపిల్ల, పిట్టపిల్ల, పిల్లి కూన ఇలా ప్రతి జీవిలో పసిపిల్లలు ముద్దొస్తాయి. అంతేకాదు పసి వయసులో అవి చేసే చిలిపి పనులు చూడ ముచ్చటగా ఉంటాయి. తాజాగా పశ్చిమబెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్‌లోని పద్మజా నాయుడు హిమాలయన్ జూపార్కులో మూడు మంచు చిరుత కూనలు సందడి చేస్తున్నాయి. జిమా అనే మంచు చిరుత గత ఏప్రిల్ 12న ఈ చిరుత కూనలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం జూలో ఈ చిరుత కూనలు చేస్తున్న చిలిపిచేష్టలు అన్నీఇన్నీ కావు. ఈ కింది వీడియోలో మీరు కూడా ఆ దృశ్యాలను వీక్షించవచ్చు.
#WATCH | West Bengal: Three cubs of a snow leopard, Zima were seen playing at Padmaja Naidu Himalayan Zoological Park, Darjeeling
— ANI (@ANI) July 7, 2021
These cubs were born on April 12, says Zoo Director
(Video source: Zoo Director) pic.twitter.com/rrKlD3ttvn
ఇవి కూడా చదవండి..
తప్పిపోయిన కుక్క ఏడేండ్లకు దొరికింది..!
‘గిన్నిస్’కు ఎక్కిన గుర్రం బిగ్ జాక్ మృతి..!
వరుడికి కట్నంగా ఆక్సిజన్..!
ఇంటర్నెట్ తెచ్చిన తంటా.. చెట్టుపై నుంచి ఉపాధ్యాయుడి బోధన..!
చేపల కోసం వల వేస్తే కొండచిలువ చిక్కింది..!