Road accident : అంబులెన్స్ (Ambulance) అదుపుతప్పి లోయలోపడిన ఘటనలో ముగ్గురు మరణించారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పంజాబ్ (Punjab) రాష్ట్రం హోషియార్పూర్ (Hoshiarpur) జిల్లాలోని చింట్పుర్ని (Chintpurni) రోడ్డుపైగల మంగువాల్ బ్యారియర్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు హిమాచల్‌ప్రదేశ్ నుంచి వస్తున్న అంబులెన్స్ మంగువాల్ బారియర్ దగ్గర అదుపుతప్పి లోయలోపడింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. గాయపడిన ఇద్దరిని బయటికి తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
#WATCH | Hoshiarpur, Punjab | Three dead after an ambulance fell into a ditch near Manguwal barrier on Chintpurni road in Hoshiarpur.
Police officer, Jasvir Singh says, “We received information around 3.30-4 am that an ambulance coming from Himachal Pradesh fell into a ditch… pic.twitter.com/BI6XGWvvQk
— ANI (@ANI) September 6, 2025