
Beautiful Video: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టడంతో పలు నిబంధనలను సడలించారు. జూపార్కులు, ఇతర దర్శనీయ ప్రాంతాల సందర్శనపై ఆంక్షలు ఎత్తివేయడంతో ఆయా ప్రాంతాలకు జనం పోటెత్తుతున్నారు. తమిళనాడులోని కొడైకెనాల్లో సైతం కొవిడ్ నిబంధనలను సడలించి సందర్శకులకు అనుమతించారు. దాంతో కొడైకెనాల్‌కు పర్యాటకులు పోటెత్తారు.
కొడైకెనాల్లోని ప్రఖ్యాత ఖాస్కేడ్ జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తున్నది. అంత ఎత్తు నుంచి పాల నురగలా పరవళ్లు తొక్కుతున్న జలపాతాన్ని చూసి సందర్శకులు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరికొకరు పోటీలు పడి మరీ జలపాతం ముందు సెల్ఫీలు తీసుకుంటున్నారు. మీరు కూడా ఈ కింది వీడియోలో కనువిందు చేస్తున్న ఈ సిల్వర్ కాస్కేడ్ జలపాతం అందాలను వీక్షించి ఎంజాయ్ చేయండి..
#WATCH | Tourists thronged Silver Cascade Falls in Kodaikanal, Tamil Nadu, amid COVID relaxations in the state (30.08) pic.twitter.com/IUEu1dLFQb
— ANI (@ANI) August 31, 2021