న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. చంచల్ పార్క్ ఏరియాలోని ఓ కేబుల్ ఆఫీస్‌లోకి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి.. ఆఫీస్ లోపల ఉన్న సిబ్బందిపై కాల్పులు దిగారు. ఇంతలో సిబ్బంది లేచి ప్రాణ భయంతో ఆఫీస్‌లోపల ఉన్న మరో గదిలోకి పరుగులు తీసి తలుపు వేసుకున్నారు. దాంతో కాల్పులు జరుపుతూనే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దుండగుల కాల్పుల్లో ఒకరికి గాయాలయ్యాయి.
కేబుల్ ఆఫీస్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఢిల్లీలోని చంచల్ పార్క్ ఏరియాలోగల ఓ కేబుల్ ఆఫీస్‌లో కాల్పులు జరిగాయంటూ తమకు ఫోన్ కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. దాంతో తాము హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని సీసీ ఫుటేజీ పరిశీలించామని చెప్పారు.
సీసీ టీవీ విజువల్స్ ప్రకారం.. ముగ్గురు దుండగులు కేబుల్ ఆఫీస్‌లోకి చొరబడి అక్కడున్న ముగ్గురిపై కాల్పులు జరిపారని, ఈ హఠాత్పరిణామంతో ఆఫీస్ లోపలున్న సిబ్బంది కంగుతున్నారని, ప్రాణభయంతో లోపలున్న మరో గదిలోకి వెళ్లి గడియ వేసుకున్నారని పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరుపుతూనే దుండగులు పారిపోయారని, ఈ కాల్పుల్లో సిబ్బందిలో ఒకరికిగా గాయాలయ్యాయని తెలిపారు.
#WATCH | A PCR call was received regarding a firing incident at a cable office in Delhi’s Chanchal Park. Three boys entered the office and opened fire on the people sitting inside. One person has been injured; investigation underway: DCP Outer
(CCTV visuals confirmed by Police) pic.twitter.com/aRvlb5DkoK
— ANI (@ANI) February 28, 2023