Haq Movie OTT | ఇమ్రాన్ హష్మీ మరియు యామీ గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రేజీ కోర్టు డ్రామా ‘హక్’ (Haq). వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే థియేటర్లలో అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేయబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా సినిమాను జనవరి 2, 2026 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది.
1980లలో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన చారిత్రాత్మక ‘షా బానో’ (Shah Bano Begum) కేసు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఒక మహిళ తన హక్కుల కోసం భర్తపై చేసిన న్యాయ పోరాటమే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. ఇమ్రాన్ హష్మీ లాయర్ పాత్రలో నటించగా, యామీ గౌతమ్ బాధితురాలిగా పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. షీబా చడ్డా ఇతర కీలక పాత్రలో నటించారు. సుపర్ణ్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
#Haq (Hindi) will be streaming from January 2 on #Netflix 🍿!!
Starring #EmraanHashmi and #YamiGautam 🌟 pic.twitter.com/bdm4XHnxFU
— Fancy Cinema (@Fancycinema) December 27, 2025