Temple Elephant : వేసవి (Summer) కాలం కావడంతో దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో జనం ఇళ్ల నుంచి అడుగు బయట పెట్టాలంటేనే భయంతో వణికిపోతున్నారు. మధ్యాహ్నం వేళల్లో ఎండ వేడి గురించైతే మాటల్లో చెప్పలేం. ఈ మండే ఎండలతో మనుషులే కాదు అన్ని జీవరాశులు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి.
వేసవి తాపానికి తాళలేక తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలోని రంగనాథస్వామి ఆలయ ఏనుగు రామలక్ష్మి ఆలయానికి సంబంధించిన స్విమ్మింగ్ పూల్లో జలకాలాడింది. ఈత కొలనులో దొర్లుతూ సేదదీరింది. రామలక్ష్మి ఈత కొలనులో జలకాలాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
#WATCH | Temple elephant Ramaleksmi plays in the swimming pool in the Nandavan of the Rameswaram Ramanathaswamy temple to beat the soaring temperature. pic.twitter.com/rYZycIyvRT
— ANI (@ANI) May 3, 2025