MK Stalin : తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ శనివారం ఉదయం తంజావూరు జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహిస్తూ స్థానికులను, అక్కడి దుకాణదారులను ఓట్లడిగారు. డీఎంకే అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.
ఈ సందర్భంగా ఆయన రోడ్డు వెంబడి ఉన్న ఓ దుకాణ సముదాయంలోకి వెళ్లారు. ఆ దుకాణ సముదాయంలోని ఓ స్వీట్ షాపులో కాసేపు సేద దీరారు. పక్కన ఉన్న టీ దుకాణం నుంచి టీ తెప్పించుకుని తాగారు. అందుకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు..
#WATCH | Tamil Nadu Chief Minister and DMK chief MK Stalin has tea at a sweet shop in Thanjavur district as he campaigns for the upcoming elections. pic.twitter.com/XsS6FVTqVH
— ANI (@ANI) March 23, 2024