Bus fire : ఏపీలోని కర్నూలు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Travels Bus) మంటల్లో చిక్కుకుని 20 మంది మరణించిన ఘటనను మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ (Delhi) నుంచి గోండా (Gonda) కు 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకున్నది.
ఆగ్రా-లక్నో జాతీయ రహదారిపై రేవ్రీ టోల్‌ప్లాజాకు 500 మీటర్ల దూరంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ముందుగా ముందు టైర్లో చెలరేగిన మంటలు క్రమంగా బస్సు మొత్తం వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్, కండక్టర్ ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు.
పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. కానీ అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు.
Major accident averted as bus catches fire on Agra-Lucknow Expressway, all passengers evacuated safely. pic.twitter.com/UHAGkx8RMJ
— The Siasat Daily (@TheSiasatDaily) October 26, 2025