Manu Bhaker parents | పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) లో మరో పతకం దక్కించుకున్న భారత షూటర్ (Indian shooter) మను భాకర్ (Manu Bhaker) తల్లిదండ్రుల ఆనందోత్సాహాలకు అవధులు లేవు. ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్య పతకం గెలిచిన మనూ భాకర్.. ఇప్పుడు మరో షూటర్ సరభ్‌జోత్ సింగ్ (Sarabjoth Singh) తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ టీమ్ ఈవెంట్లో మరో కాంస్యం దక్కించుకుంది.
దాంతో ఈ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు దక్కించుకుని మను భాకర్ రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో హర్యానాలోని ఫరీదాబాద్‌లో గల తన నివాసంలో ఆమె తల్లిదండ్రులు సంబరాలు చేసుకున్నారు. బంధుమిత్రులను పిలిచి స్వీట్లు పంచి పెట్టారు. జాతీయ జెండాను కప్పుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#WATCH | Faridabad, Haryana | Shooter Manu Bhaker’s parents celebrate after their daughter scripts history by winning two Olympic medals in the ongoing Games in Paris pic.twitter.com/ifatEb039C
— ANI (@ANI) July 30, 2024
మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఇవాళ మనూ భాకర్ సరబ్జోత్ సింగ్‌తో కలిసి కాంస్యం నెగ్గారు. కొరియా జంటపై భారత షూటర్లు మేటి ఆటను ప్రదర్శించారు. ఈ మెడల్‌తో షూటర్ మనూ భాకర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. స్వతంత్ర భారత్‌లో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఏకైక అథ్లెట్‌గా నిలిచింది.