Tejashwi Yadav : ఆర్జేడీ అగ్రనాయకుడు (RJd top leader), బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి (Bihar former deputy CM) తేజస్వియాదవ్ (Tejashwi Yadav) తన సిట్టింగ్ స్థానమైన రాఘోపూర్ (Raghopur) నుంచి నామినేషన్ (Nomination) దాఖలు చేశారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులైన తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav), తల్లి రబ్రీదేవి (Rabridevi) తో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
నామినేషన్ అనంతరం తేజస్వి మాట్లాడుతూ.. రాఘోపూర్ ప్రజలు తనపై విశ్వాసంతో ఇప్పటికే రెండుసార్లు గెలిపించారని, ఇప్పుడు మూడోసారి నామినేషన్ వేశానని, మళ్లీ గెలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు. తాము అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అనే హామీని నెరవేరుస్తామని చెప్పారు. అంతేగాక బీహార్ నుంచి నిరుద్యోగాన్ని రూపుమాపుతామని హామీ ఇచ్చారు.
తాము కేవలం ఎన్నికల్లో గెలువాలని మాత్రమే అనుకోవడం లేదని, ఎన్నికల్లో గెలిచి బీహార్ రాష్ట్రాన్ని సుసంపన్నంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నామని తేజస్వి యాదవ్ చెప్పారు. కొందరు తాను రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నానని చెబుతున్నారని, కానీ తాను మొత్తం 243 స్థానాల్లో పోటీ చేస్తున్నానని అన్నారు. ప్రతి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయడం తన బాధ్యతని చెప్పారు.