Ramen Deka : ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా రామెన్ దేకా ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ రమేశ్ సిన్హా ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. రాయ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా ఉన్న హరిచందన్ విశ్వభూషణ్ పదవీకాలం ముగియడంతో కొత్త గవర్నర్‌గా దేకాను నియమించారు.
#WATCH | Raipur: Ramen Deka takes oath as the Governor of Chhattisgarh. pic.twitter.com/eCGxPbLusS
— ANI (@ANI) July 31, 2024
ఈ సందర్భంగా రామెన్ దేకా మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితుడు కావడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లడాన్ని భవిష్యత్తులో తాను చూస్తానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నడుమ తాను మధ్యవర్తిగా వ్యవహరిస్తానని చెప్పారు.
#WATCH | Chhattisgarh Governor Ramen Deka says, “I am very happy to be the Governor of Chhattisgarh, I will see that Chhattisgarh will march ahead to be a developing state. And for that, I will work as a mediator between Government of Chhattisgarh and Central Government…” https://t.co/Qq1sAttTH9 pic.twitter.com/zKcuu4Sn7e
— ANI (@ANI) July 31, 2024