పాటియాలా: సాధారణంగా ఎవరికైనా ఉన్నచోటే కదలకుండా ఉండాలంటే కట్టేసినట్టే ఉంటుంది. కొన్ని గంటలపాటు బయటికి వెళ్లకుండా గదిలో ఉండాలంటేనే తల ప్రాణం తోకకు వస్తుంది. కానీ, పంజాబ్‌కు చెందిన సురీందర్ పాల్ ( Surinder pal ) అనే వ్యక్తి మాత్రం ఏకంగా 135 రోజులపాటు 200 అడుగుల ఎత్తున్న మొబైల్ టవర్‌పై నిరసన చేపట్టాడు. పాటియాలాలో ఎలిమెంటరీ టీచర్ ట్రెయినింగ్ (ఈటీటీ), టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఈటీ) క్వాలిఫైడ్ టీచర్లు తమ డిమాండ్ల కోసం గత కొన్ని నెలలుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.
ఆ నిరసనల్లో భాగంగానే సురీందర్ పాల్ అనే టీచర్ గత 135 రోజులుగా మొబైల్ టవర్‌పై నిరసన ప్రదర్శన చేపట్టాడు. అయితే సోమవారం ప్రభత్వం వారి డిమాండ్లకు ఒప్పుకోవడంతో కిందకు దిగాడు. పోలీసులు తాళ్ల సాయంతో ఆయనను కిందకు దించారు. అందుకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Punjab: Surinder Pal, who was atop a 200-ft mobile tower for past 135 days, ended his stir after govt accepted demands of protesting ETT-TET-qualified teachers in Patiala pic.twitter.com/2Gy1y5I6mZ
— ANI (@ANI) August 2, 2021