Kamba Ramayanam: ప్రధాని నరేంద్రమోదీ తమిళనాడు పర్యటనలో బిజీగా ఉన్నారు. శుక్రవారం తమిళనాడు రాజధాని చెన్నైకి చేరుకున్న ప్రధాని.. సాయంత్రం అక్కడ జరిగిన ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2023’ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా హాజరయ్యారు.
ఇవాళ ఉదయం తమిళనాడు రాజధాని చెన్నైలోని రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ గవర్నర్ ఆర్ఎన్ రవిని కలిశారు. అనంతరం రాజ్‌భవన్ ప్రాంగణంలో గవర్నర్‌తో కలిసి రుద్రాక్ష మొక్కను నాటారు. ఆ తర్వాత తిరుచిరాపల్లికి వెళ్లి శ్రీరంగనాథుని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో కంబ రామాయణ శ్రవణం చేశారు. ప్రధాని కంబ రామాయణ శ్రవణానికి సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Tamil Nadu: PM Modi listens to a scholar reciting verses from the Kamba Ramayanam at Sri Ranganathaswamy Temple in Tiruchirappalli.
One of the very old versions of Ramayana is the Kamba Ramayana, which was composed by Tamil poet Kamban in the 12th century. Kamban first… pic.twitter.com/V18VO1FOpb
— ANI (@ANI) January 20, 2024
#WATCH | Tamil Nadu: Prime Minister Narendra Modi listens to a scholar reciting verses from the Kamba Ramayanam at Sri Ranganathaswamy Temple in Tiruchirappalli. pic.twitter.com/BJgzeIR0fC
— ANI (@ANI) January 20, 2024
అనంతరం ప్రధాని రామేశ్వరం బయలుదేరారు. రామేశ్వరంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో.. ప్రధాని మోదీ వివిధ రాష్ట్రాల్లోని ప్రిసిద్ధి రామాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.