Farmers protest : రైతుల ‘ఢిల్లీ చలో (Dilli Chalo)’ ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పంజాబ్-హర్యానా సరిహద్దుల్లోని శంభు బార్డర్ (Shambhu border) నుంచి ర్యాలీగా ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీ చార్జ్ చేశారు.
అయితే తమ ఢిల్లీ ఛలో యాత్రకు ముందే పోలీసుల అనుమతి తీసుకున్నామని, ముందుగా అనుమతి ఇచ్చి, ఇప్పుడు అడ్డుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కాగా ఢిల్లీ ఛలో ర్యాలీలో భాగంగా ఢిల్లీలోకి 101 మంది రైతులం వస్తామని అనుమతి తీసుకున్నారని, ఆ 101 మంది జాబితా ప్రకారం అనుమతి ఉన్న రైతులనే లోపలికి అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. అందరూ గుంపుగా వస్తే అనుమతించేది లేదని తెగేసి చెప్పారు.
#WATCH | Police use tear gas to disperse farmers who began their ‘Dilli Chalo’ march today, but stopped at the Shambhu border
“We will first identify them (farmers) and then we can allow them to go ahead. We have a list of the names of 101 farmers, and they are not those people… pic.twitter.com/KGpmxDjGD4
— ANI (@ANI) December 8, 2024