డెహ్రాడూన్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా వానలు పడుతున్నాయి. దాంతో ఆయా రాష్ట్రాల్లోని నదులు, నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాల్సిన ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి నదులు, నాలాలు దాటాల్సి వస్తున్నది.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అమ్లావా నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. డెహ్రాడూన్ జిల్లాలో ఆ నదిపై నిర్మించిన ఓ తాత్కాలిక బ్రిడ్జి ఒకవైపు నుంచి విరిగిపోయి నదిలో పడింది. అయినా జనం ఆ విరిగిన బ్రిడ్జిని ఆసరాగా చేసుకుని ప్రమాదకర రీతిలో నదిని దాటుతున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి జనం నదిని దాటుతున్న ఆ దృశ్యాలను ఈ కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | People trying to cross Amlawa River via a temporary bridge, which was damaged due to heavy rainfall, in Dehradun district#Uttarakhand pic.twitter.com/sg7L17nPEA
— ANI (@ANI) July 13, 2021