న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం మళ్లీ పెరిగింది. వాయు నాణ్యత (Air quality) అధ్వాన్న స్థాయికి చేరింది. ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలో AQI (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 266 గా ఉన్నది. దాంతో ఉదయం నగరంలో దుమ్ముధూళి దట్టమైన పొగమంచులా కప్పేసింది.
దాంతో రోడ్లపై విజుబిలిటీ తగ్గిపోయింది. వంద మీటర్లకు మించి దారి కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం ఉదయం గాలి కాలుష్యం కారణంగా ఢిల్లీపై దుమ్ముధూళి కప్పేసిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు. ఇండియాగేట్ వద్దగల కార్తవ్యపాథ్లో కాలుష్య వాతావరణంలోనే ఢిల్లీ వాసులు మార్నింగ్ వాక్ చేస్తున్నారు.
#WATCH | Overall Air Quality Index (AQI) in Delhi stands at 266, in the ‘Poor’ category as per SAFAR-India.
Visuals from Kartavya Path- India Gate pic.twitter.com/HLM7CcqLj6
— ANI (@ANI) October 22, 2023