భువనేశ్వర్: ఒడిశాలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే పూరీ జగన్నాథ రథయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు జగన్నాథస్వామి రథంపై ఊరేగనున్నాడు. స్వామివారి రథయాత్రకు ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకుండా ఒడిశా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఈసారి రథయాత్రకు భక్తులను అనుమతించడంలేదు. కేవలం అర్చకులు, ఆలయ సిబ్బంది మాత్రమే రథయాత్రలో పాల్గొననున్నారు.
కరోనా మహమ్మారి విస్తరణ నేపథ్యంలో భక్తులంతా ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, ఏ ఒక్కరూ కూడా రథయాత్రను ప్రత్యక్షంగా వీక్షించేందుకు రావద్దని ఆలయ ప్రధాన సేవకులు కోరారు. ప్రజలంతా ఎవరి ఇండ్లలో వాళ్లు ఉండి టీవీల ద్వారా రథయాత్రను వీక్షించాలని సూచించారు.
#WATCH | Odisha: Final preparations for tomorrow's Rath Yatra in Puri. Tight security deployed. No devotees to be allowed in the Yatra due to COVID-19
— ANI (@ANI) July 11, 2021
"Govt's decision should be followed by all. I request people to watch yatra on TV," says a Daitapati Sevak of Jagannath temple. pic.twitter.com/ycovJVjPkk