Nepal PM : ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానాలు అందుకున్న విదేశీ నేతలు ఒక్కొక్కరుగా ఢిల్లీకి చేరుకుంటున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శనివారం సాయంత్రమే ఢిల్లీకి రాగా.. నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీకి విచ్చేశారు.
ప్రచండ తన ప్రతినిధి బృందంతో కలిసి ఢిల్లీలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఢిల్లి విమానాశ్రయంలో ఆయన ఘనస్వాగతం లభించింది. ఇప్పటికే రెండు పర్యాయాలు ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసి పదేళ్లు దేశాన్ని పాలించిన నరేంద్రమోదీ.. ఈ సాయంత్రం ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
సాయంత్రం ఆరు గంటలకు ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభం కానుంది. రాత్రి 7.15 గంటలకు ప్రధాని ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం బీజేపీ దేశవిదేశీ నేతలకు ఆహ్వానాలు పంపింది. దాంతో ఒక్కొక్కరుగా ఢిల్లీకి చేరుకుంటున్నారు.