ముంబై: మహారాష్ట్రలో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. ముఖ్యంగా సంగ్లీ జిల్లా కేంద్రంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సంగ్లీ పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో నడుములోతు నీరు నిలిచింది. పోలీస్స్టేషన్ ఏరియాలో కూడా భారీగా వరదనీరు చేరింది. దాంతో పోలీస్స్టేషన్, దాని పరిసరాల్లోని నివాసాలు, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు పాక్షికంగా నీళ్లలో మునిగిపోయాయి. బయటి జనం లోపలికి, లోపలి జనం బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది.
#WATCH | Maharashtra: Shops, cars and a police station partially submerged in water in Sangli, following incessant rain causing floods pic.twitter.com/uMq0H7q8Rr
— ANI (@ANI) July 25, 2021