Fire accident: పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను మధ్యప్రదేశ్ మంత్రి ఉదయ్ ప్రతాప్ సింగ్ పరామర్శించారు. హర్దా జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి మంత్రి ధైర్యం చెప్పారు. బాధితుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. క్షతగాత్రుల పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పేలుడు సంభవించిన ప్రాంతాన్ని మంత్రి ఉదయ్ ప్రతాప్ సందర్శించారు. ఘటనా ప్రాంతంలో కొనసాగుతున్న ఫైర్‌ఫైటింగ్ ఆపరేషన్స్‌ను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి.. తాను జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ప్రమాదం వివరాలను తెలుసుకున్నానని చెప్పారు.
క్షతగాత్రులను హర్దా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారని, తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హోషంగాబాద్, భోపాల్ ఆస్పత్రులకు తరలించారని మంత్రి ఉదయ్ ప్రతాప్ తెలిపారు. ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారని అన్నారు.
#WATCH | Madhya Pradesh minister Uday Pratap Singh visits District Hospital in Harda, Madhya Pradesh to meet the patients injured in a massive explosion that took place in a firecracker factory, earlier today. pic.twitter.com/NUKLjr9R3E
— ANI (@ANI) February 6, 2024
#WATCH | Madhya Pradesh minister Uday Pratap Singh arrives at the firecracker factory in Harda, Madhya Pradesh where a massive explosion took place today.
Firefighting operation is underway at the factory. pic.twitter.com/NHjnibB5JU
— ANI (@ANI) February 6, 2024