Bengaluru rain : కర్ణాటక రాజధాని బెంగళూరులో కుంభవృష్టి కురుస్తోంది. గత రెండు మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది. దాంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమ్యాయి. వీధులు చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ భారీగా వరద నీరు నిలిచింది. పలుచోట్ల ఈ వరద నీటిలో చేపలు కూడా కొట్టుకువచ్చాయి. దాంతో స్థానికులు చేపలు పట్టుకునేందుకు పోటీ పడుతున్నారు. యెలహంకలోని అల్లాలసంద్ర ఏరియాలో స్థానికులు వరద నీటిలో చేపలు పడుతున్న దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
కాగా భారీ వర్షాలు, వరదల కారణంగా బెంగళూరు నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపై వరదనీరు పారుతూ నదులను తలపిస్తుండటంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల అయితే ఏకంగా వరదనీరు ఇళ్లలోకే ప్రవేశించింది. దాంతో కింద కాలు పెట్టలేక మంచాలపైన, టేబుళ్లపైనే గడపాల్సిన దుస్థితి నెలకొంది. అటు ఆంధ్రప్రదేశ్లోనూ దానా తుఫాన్ ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. అనంతపురం జిల్లాలో కుంభవృష్టి కురిసింది. దాంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
#WATCH | Karnataka: Locals were seen fishing at several places in Bengaluru amid waterlogging due to incessant heavy rain. Visuals from Allalasandra, Yelahanka. pic.twitter.com/9gYrjOI0FY
— ANI (@ANI) October 22, 2024