Salal Dam : భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇవాళ మరింత ఉధృతమయ్యాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లో పాకిస్థాన్ రెండు రోజులుగా కవ్వింపు దాడులకు పాల్పడుతోంది. దాంతో భారత్ ప్రతిదాడికి దిగింది. పాకిస్థాన్‌లోని రావల్పిండి (Rawalpindi), లాహోర్ (Lahore), ఇస్లామాబాద్ (Islamabad) సహా పలు ప్రాంతాలపై డ్రోన్ (Drone) లతో విరుచుకుపడింది.
అంతకుముందు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్థాన్‌లోనే శిక్షణ పొందారనే సమాచారం అందడంతో.. భారత్ ప్రతిచర్యలకు ఉపక్రమించింది. ఎగుమతి, దిగుమతులను నిలిపేసింది. గగనతలాన్ని మూసేసింది. సింధూ జలాలను కట్టడి చేసింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులకు పాల్పడింది. దాదాపు 100 మందికిపైగా ఉగ్రవాదులను హతమార్చింది.
ఈ క్రమంలో ఇవాళ రియాసీలో చీనాబ్ నదిపై నిర్మించిన సలాల్ డ్యామ్ నుంచి స్వల్పంగా పాకిస్థాన్‌కు నీటిని విడుదల చేశారు. మొత్తం మూడు గేట్ల నుంచి దిగువకు నీరు వెళ్తోంది. సలాల్ డ్యామ్ నుంచి నీరు దిగువకు వెళ్తున్న దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Jammu and Kashmir: Latest visuals from Reasi’s Salal Dam built on Chenab River; 3 gates of the dam are seen open.
(Visuals shot at 4:45 pm today) pic.twitter.com/kkZlJ7PynZ
— ANI (@ANI) May 8, 2025