Champai Soren : జార్ఖండ్ (Jarkhand) మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ (Champai Soren) సరైకెల్లా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ (Nomination) దాఖలు చేశారు. శుక్రవారం ఉదయం పార్టీ స్థానిక నేతలతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లిన చంపాయ్ సోరెన్.. రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని అన్నారు.
జార్ఖండ్‌లోకి బంగ్లాదేశీ చొరబాటుదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నదని, ఈ నేపథ్యంలో కేవలం బీజేపీ మాత్రమే స్థానికులకు, రాష్ట్రంలోని గిరిజనులకు న్యాయం చేయగలదని సోరెన్ అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 81 సీట్లలో విజయం సాధించబోతున్నదని ఆయన జోస్యం చెప్పారు. కేవలం జార్ఖండ్లోనేగాక, దేశమంతటా బీజేపీ హవా నడుస్తున్నదని అన్నారు. బీజేపీ ప్రభంజనాన్ని అడ్డుకోవడం ఎవరి తరంకాదని ఆయన వ్యాఖ్యానించారు.
#WATCH | #JharkhandElection2024 | Former CM Champai Soren files his nomination as BJP candidate from Saraikella. pic.twitter.com/rVPzQmuAXq
— ANI (@ANI) October 25, 2024