న్యూఢిల్లీ: చంద్రయాన్-3 ద్వారా చందమామ ఉపరితలంపైకి చేరిన ప్రగ్యాన్ రోవర్ తీసే చిత్రాలు, వీడియోలను ఇస్రో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నది. తాజాగా రోవర్‌కు సంబంధించిన మరో కొత్త వీడియోను ఇస్రో ట్విటర్ (X) లో షేర్ చేసింది. విక్రమ్ ల్యాండర్ దిగిన శివశక్తి పాయింట్లో ప్రగ్యాన్ రోవర్ తిరగాడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి.
‘దక్షిణ ధృవంపై చందమామ రహస్యాల అన్వేషణలో భాగంగా ప్రగ్యాన్ రోవర్ శివశక్తి పాయింట్ పరిసరాల్లో తిరగాడుతున్నది’ అనే కామెంట్‌ను ఇస్రో తాను పోస్ట్ చేసిన వీడియోకు జతచేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. కాగా, శనివారం ఉదయం బెంగళూరులో ఇస్రో బృందాన్ని కలిసిన ప్రధాని మోడీ.. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతానికి శివశక్తి అని నామకరణం చేశారు.
#WATCH | Chandrayaan-3 Mission: ISRO tweets, “Pragyan rover roams around Shiv Shakti Point in pursuit of lunar secrets at the South Pole!”
(Source: ISRO) pic.twitter.com/U3FbeHQVd3
— ANI (@ANI) August 26, 2023